నవతెలంగాణ కంటేశ్వర్
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన పన్నులు ఉపసంహరించు కోవాలని, పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకొని సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ(ఎం), సీపీఐ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్యలు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల పైన రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి భారాలు వేస్తుందని అన్నారు. వాటి ఫలితంగా మధ్యతరగతి ప్రజలు వాడే నిత్యావసర సరుకుల ధరలు రాకెట్ వేగంతో ఆకాశానికి దూసుకెళ్తున్న నాయని వాటి నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కేవలం అంబానీ ఆదాయాన్ని పెద్దపెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనాలే పరమావధిగా భావిస్తూ పనిచేస్తున్నారని భాగంగానే గత మూడు నెలల కాలంలో వంటగ్యాస్ ధరలను రెండు వందల రూపాయలకు పెంచి సాధారణ మధ్య తరగతి ప్రజలు గ్యాస్సును వాడకుండా దూరం చేస్తున్నారని తెలిపారు. ఈ పద్ధతుల్లో చేయటం మూలంగా ప్రజలు పూర్వపు స్థితికి కట్టెల మీద వంటలు చేసుకునే పరిస్థితికి నెట్టివేయబడుతుంది అని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డీజిల్ పై వేసిన పనులను ఉపసంహరించుకోవాలని డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని వంట గ్యాస్ ధరలను కాలనీ సిడీలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సబ్బని లత, కొండ గంగాధర్, కె రాములు, సిపిఐ జిల్లా నాయకులు సుధాకర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Feb,2021 06:05PM