నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని సాంపల్లి తాండలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త మోహన్ తల్లి ఇటీవల మృతి చెందారు. మాతృవీయోగంలో ఉన్న పార్టీ సీనియర్ కార్యకర్త మోహన్ ను వారి ఇంటి వద్ద నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు బాజిరెడ్డి జగన్ మోహన్, ఒడిసి ఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్ లతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అన్నివిధాలుగా అండగా ఉంటామని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శక్కరికొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒడ్డేం నర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, జగదీష్, తో పాటు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Feb,2021 06:15PM