- అభినందనలు తెలిపిన జిల్లా ప్రముఖులు
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ వాలీబాల్ చాంపియన్ షిప్ లో రన్నరప్ గా నిలిచిన జిల్లా మహిళా జట్టు ను జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రశంసించారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ వాలీబాల్ చాంపియన్ షిప్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకెళ్ళిన ఇందూరు మహిళలు తుది పోరు లోను తమదైన శైలిలో ఆటతీరును ప్రదర్శించారు. ప్రత్యర్థులతో సమఉజ్జీలుగా చెరో రెండు సెట్లు గెలిచిన అనంతరం బెస్ట్ ఆఫ్ ఫైవ్ విధానంలో జరిగిన ఈ మ్యాచ్ లో చివరి సెట్ నల్గొండ జిల్లా జట్టు గెలుచుకోవడంతో నిజామాబాద్ జిల్లా జట్టు రన్నరప్ ట్రోఫీని దక్కించుకుంది. జిల్లా జట్టుకు పి ఈ టి గడ్డం శ్రీనివాస్ కోచ్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. వీ. హనుమంత్ రెడ్డి, కార్యదర్శి బీ. మల్లేష్ గౌడ్, కోశాధికారి కాంతి గంగారెడ్డి, నిర్వాణ కార్యదర్శి బి. పవన్ కుమార్ తదితరులు జిల్లా జట్టును అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Feb,2021 07:35PM