హైదరాబాద్: ప్రపంచ స్వచ్చంధ సంస్థల దినోత్సవం, ఫిన్ బధిరుల సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని మలక్ పేట్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ పాల్గొని పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా బంజారా మహిళా యన్ జీ వో డా.ఆనంద్ మరియు ఇతర యన్ జీ వో సంస్థల సేవలను సజ్జనార్ కొనియాడారు.ముఖ్యంగా కోవిడ్ కష్ట కాలంలో ఎన్నో ఉచిత శిబిరాలను నిర్వహించడం తో పాటు, పోలీస్ యాజ మాన్యానికి మాస్కులు,సానిటైజర్ లు అందిచినందుకు డా.ఆనంద్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు జానకి, ఉప్పల శ్రీనివాస్ గుప్త, దేవి ప్రసాద్, బాల కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm