- తల్లుల దర్శనంతో తరించిన భక్తులు
- తగ్గిన భక్తజన ప్రవాహం..
- ముగిసిన మీని మేడారం జాతర
- ఊపిరి పిలుచుకున్నా యంత్రాంగం
నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మీని జాతర నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగి శనివారంతో ముగుసింది. దేశ నాలుగు మూలల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు.జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, ఎత్తు బంగారం తో నడుచుకుంటూ గద్దె ల చెరుకుని వనదేవతలైన సమ్మక్క- సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు లకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, కొబ్బరికాయలు, బెల్లం(బంగారం) పుట్టు వెంట్రుకలు, ఒడిబియ్యం, కానుకలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు సిద్దబోయిన ముణెందర్, కొక్కెర క్రిష్ణయ్య, సిద్దబోయిన అరుణ్, మల్లెల ముత్తయ్య, బొక్కెన్న,కొక్కెర పూర్ణచందర్, పాపారావులు, ఏండోమెంట్ ఈవో రాజేంద్రం ఆధ్వర్యంలో ఏండోమెంట్ సిబ్బంది క్రాంతి, మధు, రాజేశ్వర్, రమాదేవి, లు భక్తులకు ఏ లోటు రాకుండా దగ్గర ఉండి దర్శనభాగ్యం కల్పించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు మొక్కులు సమర్పించి జాతర పరిసర ప్రాంతాలలో ఉన్న మ్యూజియం, చిలకలగుట్ట, సారలమ్మ గుడి, సందర్శించి ఉల్లాసంగా
గడిపారు.అనంతరం కోళ్లను మేకలను తల్లులకు నైవేద్యంగా సమర్పించి కోసుకుని వంటలు చేసుకుని తిని విడిది చేసి మళ్లీ పెద్ద జాతర కు వస్తాం సల్లంగా చూడు తల్లి అని మనసారా మొక్కుకొని విడిది చేసి వెళ్లారు. నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినా మీనీ జాతర(మండే మెలిగే పండుగ) ప్రశాంతంగా ముగియడంతో అదికార యంత్రాంగం ఊపిరి పిలుచుకున్నా రు.
నిరంతరం సేవలందించిన రెవెన్యూ, పోలీసు, వైద్య, పారిశుద్ధ్యం
ఫిబ్రవరి 24 నుండి మినీ మేడారం జాతర ప్రారంభం కాగా అంతకంటే ముందు నుండే మేడారానికి భక్తుల రద్దీ పెరిగింది. దీనికనుగుణంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామం సింగ్ జీ పాటిల్ ఆదేశాల మేరకు తహశీల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, ఆయన సిబ్బంది, పస్రా సిఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు లు వారి బలగాల తో, వైద్య, పారిశుద్ధ్యం అధికారులు కూడా మేడారం లో స్థానికంగా ఉంటూ, ఇక్కడ నే రాత్రి పగలు లేకుండా నిరంతరం కష్టపడి సేవలందించి మినీ మేడారం జాతరను విజయవంతం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Feb,2021 07:11PM