- అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు కోగిల అజయ్ కుమార్
నవతెలంగాణ గోవిందరావుపేట
భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొగిల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్,అంబెడ్కర్ సంయుక్త సంఘాల ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు కోగిల అజయ్ అధ్యక్షతన మండల తహసీల్దార్ రమాదేవి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈయొక్క కార్యక్రమంలో అజయ్ కుమార్ మరియ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నర్సయ్య మాదిగ మాట్లాడుతూ.. 2002లో అంబెడ్కర్ కమిటీ హల్ కోసం కేటాయించిన స్థలంలో మహిళ సమైక్య భవనం నిర్మాణం జరిగింది.వేరే స్థలం ఇస్తాను ఆరోజు హామీ ఇచ్చారు.అప్పటి నుంచి మాకు ప్రభుత్వం స్థలం కేటాయించే విషయంలో చొరవ చూపడం లేదు. భారతీయ న్యాయవాది,ఆర్థిక శాస్త్రవేత్త,రాజకీయ నేత,సంఘ సంస్కర్త యొక్క కమిటీ దళితుల పై అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్రన్యాయశాఖమంత్రి, రాజ్యాంగ శిల్పి అయిన
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ కమ్యూనిటీకి స్థలం కేటాయించాలి అని డిమాండ్ చేశారు.
స్థలాన్ని పరిశీలించిన తాహాశీల్దార్
తహశీల్దార్ రమాదేవి స్వయంగా స్టలాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యా పరిష్కారం చేస్తాం అని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం ఉంటే మాకు తెలియపరచాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీమా నాయక్, నర్సింహా, ముత్తయ్య, సుశీల, తెలంగాణ యువజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నెమలి బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల శ్రీకాంత్, నాయకపోడ్ పోడు దెబ్బ రాష్ట్ర కమిటీ సభ్యులు గండేపల్లి నర్సయ్య, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా నాయకులు కళ్లెపెళ్లి రమేష్,కొమ్ముల రాజు,డొంక చిన్ని,రాజు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Feb,2021 07:27PM