- జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
నవ తెలంగాణ ముత్తారం
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఈ రోజు నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆపద సమయంలో పార్టీలో పనిచేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తెలిపారు. శనివారం రోజున ముత్తారం మండల కేంద్రానికి చెందిన కళ్యాణపు కమల టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఇటీవల ప్రమాదంలో మృతి చెందగా మృతురాలి భర్త కళ్యాణపు విజ్జగిరికి పార్టీ ద్వారా రూ2 లక్షల బీమా సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూటీఆర్ఎస్ పేద ప్రజల సంక్షేమంతో పాటు కార్యకర్తలకు అండగా ఉంటుందని అన్నారు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు దూసుకుపోతుందని ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అభివృద్ధియో ఇందుకు కారణమన్నారు ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి చెలకల స్వర్ణలత అశోక్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి సింగిల్విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి వైస్ ఎంపీపీ సుధా టి రవీందర్ రావు మాజీ ఎంపీపీ మండల రైతు బంధు కన్వీనర్ అత్తె చంద్రమౌళి టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుట్ల రవీందర్ మండల యూత్ అధ్యక్షుడు రావుల సతీష్ పెయ్యల కుమార్ మెంగాని తిరుపతి రామచంద్ర రెడ్డి చల్ల సమ్మయ్య అల్వోజు రవింద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Feb,2021 07:37PM