నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అధికారులు ఆశలపై ఒత్తిడులు మానుకోవాలని స్మార్ట్ఫోన్ ఇచ్చిన తర్వాతనే ఆన్లైన్ సర్వే చేయించాలి అని సీఐటీయూ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని నామ్ దేవ్ వాడలోని సీఐటీయూ కార్యాలయంలో ఆశావర్కర్ల జిల్లా ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజమణి యూనియన్ నగర అధ్యక్షురాలు రేణుక, పద్మ, మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో మెడికల్ అధికారులు ఆన్లైన్ లో సర్వే చేయాలని ఆశల పైన ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఆశలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదు. స్మార్ట్ ఫోన్ లేనప్పుడు సర్వే చేయడం సాధ్యం కాదు కనీసం ఈ అంశాన్ని కూడా గమనించకుండా జిల్లా అధికారులు ఆశాల పైన ఒత్తిడి చేయడం అన్యాయం, పైగా కొంతమంది మంద అధికారులు ఆశాలకు కొంతమందికి ఫోన్స్ ఉన్నాయి కదా అని, మీ ఇంట్లో మీ భర్తలకు లేవా అని, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్దతి కాదు, ప్రభుత్వం ఏదైనా పని చేయించుకోవాలని చూసినప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. సెల్ ఫోన్ ఇవ్వకుండా సర్వే చేయాలనే ఒత్తిడి చేయడం సరైంది కాదు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 8న కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా నాయకులు, దివ్య, పంచశీల, సరూప, సోనీ, రాజ కళ, లక్ష్మి , సంధ్య, అనిత, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 04:04PM