నవతెలంగాణ-కంటేశ్వర్
నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ హెల్త్ ఇండియా ఆన్లైన్ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ మాట్లాడుతూ.. అన్నిధానల్లో కన్న రక్తదానం చాలా ముఖ్యమని ఒక మనిషి రక్తదానం చేయటం ద్వారా ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు కాపాడే శక్తి కలిగినది ఇటువంటి మహత్తర కార్యమాన్ని ఏర్పాటు చేశారు. హెల్ప్ ఇండియా ఆన్లైన్ పరివార్ వారు ప్రపంచ రికార్డ్ సాధించిన ఆర్గనైజేషన్ గా నిలవడం అంటే ఇది మీ సేవబావనికి నిదర్శం అని తెలియజేస్తూ ప్రతి వ్యక్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సుపెరిండెంట్ ప్రతిమ రాజ్ , హెల్ప్ ఇండియా ప్రతినిధులు, కార్పొరేటర్లు శివచరన్, మెట్టు విజయ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 04:24PM