నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలం లోని సిర్నపల్లి గ్రామానికి చెందిన ఒంటేరు నర్సారెడ్డి గల్ఫ్ కార్మికుడు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై కుటుంబ పోషణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియాకు వచ్చారు. 1నవంబర్ 20న సౌదీ అరేబియాలోని, సకాక ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతదేహాన్ని పంపించే విషయంలో కంపెనీ తీవ్రమైన నిర్లక్ష్యం వహించడం వల్లా ఈ విషయం తెలుసుకున్న GWACజిడ్లుఎసి శకాక ఇంచార్జ్ కమిటీ కోమిరే బన్నీ గౌడ్ (ఆంజనేయులు), సుక్కబొట్ల రాజు, తిరుపతి, మృతదేహాన్ని పంపించేందుకు ఇండియన్ ఎంబసీలో పూర్తి బాధ్యత తీసుకుని GWAC గ్వాస్ సభ్యుడు రాజు తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తోటి గల్ఫ్ కార్మికులు మృతదేహాన్ని పంపించేందుకు తమ డ్యూటీని వదులుకొని సౌదీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షుడు, సభ్యులు కంపెనీ యాజమాన్యంతో, ఇండియన్ ఎంబసీ అధికారులను తమ సొంత వాహనంలో తీసుకెళ్తూ మృతదేహాన్ని పంపించేందుకు పోలీస్ స్టేషన్, హాస్పిటల్ సంబంధించిన పేపర్ వర్క్ స్వయంగా GWAC గ్వాస్ సభ్యులు పూర్తి చేశారు. మృతదేహాన్ని పంపించేందుకు పూర్తి సహకారాన్ని అందించిన సౌదీ ఇండియన్ ఎంబసీ అధికారులు, ప్రత్యేకంగా సుదీర్ (కేరళ) గ్వాస్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 4 నెలల గడిసిన తెలంగాణ గల్ఫ్ కార్మికుని మృతదేహాన్ని తీసుకువచ్చే విషయంలో అశ్రద్ధ వహించిన తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వం కార్మికుల పట్ల శ్రద్ధ వహిస్తే గల్ఫ్ లో చనిపోయిన మృతదేహం వారం రోజుల్లో ఇంటికి వచ్చేలా ప్రయత్నం చేయవచ్చని గల్ఫ్ కార్మికులు, సౌది అరేబియా శాఖ సభ్యులు వివరించారు.
బడ్జెట్లో 5వందల కోట్లు ఎన్నారై పాలసీకి కేటాయించాలి...
త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో 500 కోట్ల నిధులతో తెలంగాణ సంపూర్ణ ఎన్నారై పాలసీని అమలు చేసి, అమృత ధన సహాయం 5 లక్షల రూపాయలు అందించాలని, మృతదేహాలను తెప్పించే విషయాల్లో శ్రద్ధ వహించాలని, సౌదీ శాఖ అధ్యక్షుడు బడుగు లక్ష్మణ్, గౌరవాధ్యక్షుడు షేక్ అబ్దుల్ కాలీమ్, ఉపాధ్యక్షుడు నంది శ్రీను పటేల్, సమన్వయ కమిటీ అధ్యక్షుడు సత్రాబోయిన దేవన్న, ప్రధాన కార్యదర్శి కొక్కుల చిన్నయ్య, సలహాదారుడు బిజిలి దేవన్న, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తరఫున, తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు. ఒంటరి నర్సారెడ్డి మృతదేహం సోమవారం ఉదయం సుమారు8గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్టు వరకు చేరుకుంటుందని గల్ఫ్ సంక్షేమ కార్మికుల సంఘం అధ్యక్షులు బడుగు లక్ష్మణ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 04:34PM