-పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- 2021
-సభలో ఎమ్మెల్యే రాజాసింగ్
నవ తెలంగాణ- సుల్తాన్ బజార్
నేటి యువకులు దేశ సేవ కోసం దృఢంగా ఉండాలని గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు తెలంగాణ ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ -2021 పోటీలను ఆదివారం హనుమాన్ టెక్డి లోని ప్రగతి మహా విద్యాలయం లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత ఆటలు పోటీలో రాణించాలని సూచించారు దేశ రక్షణ కోసం యువతీ, యువకులు దృఢంగా ఉండాలన్నారు పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడం వల్ల యువతి, యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుందని గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగాపవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలైన వారికి నగదు పురస్కారం అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ అసోసియన్ రాష్ట్ర అధ్యక్షులు ఓం ప్రకాష్ బిశ్వ.కార్పొరేటర్ డాక్టర్ సురేఖ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్. కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్. జగదీష్ జోషి. నంద రాజ్ .వినోద్. ఐటీ సెల్ కన్వీనర్ వివేక్. తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 06:22PM