నవతెలంగాణ - భిక్కనూర్
మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ పట్టుపరిశ్రమ స్థలంలో గ్రామ సర్పంచ్ మధు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. కాగా ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నాటిన మొక్కలకు నిప్పు అంటించడంతో పెద్ద ఎత్తున హరిత హారంలో నాటిన మొక్కలు దగ్ధమయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న సర్పంచ్ మధు మోహన్ రెడ్డి గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా మంటలను అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి పెద్ద ఎత్తున మొక్కలను నాటితే గుర్తుతెలియని వ్యక్తులు దగ్నం చేయడం బాధాకరమన్నారు. మంటలు ఆర్పిన వారిలో సర్పంచ్ తో పాటు సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 07:22PM