- సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ కంటేశ్వర్
మార్చి 1న కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే బీడీ ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానం పల్లి లో విలేకరుల ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమపై ఆంక్షలు పెట్టింది. దేశ వ్యాప్తంగా 85,లక్షల మంది అధారపడి జీవిస్తున్నారు, బీడీ కట్ట పై ఊపిరితిత్తుల బొమ్మ , గొంతు క్యాన్సర్ బొమ్మ,,GST,పెట్టడం,గొంతు క్యాన్సర్ బోమ్మ ముద్రించడం వల్ల బీడీ అమ్మకాలు పడిపోయాయి. అదేవిధంగా బీడీ పైన జిఎస్టి విధించడం వల్ల బీడీ అమ్మకాలు పడిపోయి. ఉత్పత్తి తగ్గి కార్మికులకు సగం పని మాత్రమే దొరుకుతుంది. ఇదే వెలుగులో తిరిగి సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) 2003 తీసుకొచ్చింది ఇందులో ప్రధానంగా బీడీ కట్టలపై బ్రాండు పెట్టకూడదని ప్రకటనలు చేయకూడదని 21 సంవత్సరాలు పైబడిన పిల్లలకు మరియు బడి దగ్గర అమ్మ కూడదని సవరణలు తీసుకు వచ్చింది. అదే విధంగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే లక్ష రూపాయలు జరిమానా పెంచింది. ఏడు సంవత్సరాలు జైలు శిక్షను నిర్ణయించింది. అయినా తప్పు చేసినట్టు రుజువైతే పోలీస్ స్టేషన్ లో కాకుండా కోర్టులో మాత్రమే బెయిలు తీసుకోవాలి. వీటి అనుమతి వల్ల బీడీల అమ్మకాలు పడిపోయి . ఉత్పత్తి తగ్గడం వల్ల బీడీ కార్మికుల కు పని లేకుండా పోతుంది. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి,ప్రతి ఒక్కరికీ కేంద్రం ప్రభుత్వం బీడీ కార్మికులకు,6000/ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలు తక్షణమే ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకూడదని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సఇస్తుంది . ఈ బిల్లు ఆమోదం పొందితే విచ్చలవిడితనం పెరిగి బ్లాక్ మార్కెట్ విస్తరిస్తుంది. బీడీ రంగాన్ని సర్వ నాశనం చేస్తే బడా కార్పొరేట్ల చేతుల్లో ఉన్న సిగరెట్ కంపెనీలకు లాభాలు కల్పిస్తుంది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బీడీ పరిశ్రమ పై ఆంక్షలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వానికి గద్దె దించే సమయం ఆసన్నమైంది. ఈ కార్యక్రమంలో టేకేదార్ యూనియన్ రాష్ట్ర నాయకులు సుదర్శన్, జ్యోతి, ఆకలి సవిత, చాకలి జయశ్రీ, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 07:32PM