-జాతర ముగిసిన తరలివస్తున్న భక్తులు
- నేడు వనదేవతలను దర్శించుకున్న 15వేల మంది భక్తులు
నవతెలంగాణ- తాడ్వాయి
మీని మేడారం జాతర ముగిసిన ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు.ఈ నేల 24నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా మినీ జాతరకు దాదాపుగా 6లక్షలమంది హాజరైనట్టు అధికారులు తెలిపారు. వివిద ప్రాంతాలైన హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుండే కాక, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆదివారం వేలాదిగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ముందుగా జంపన్న వాగు లో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకుని పసుపు కుంకుమ పూలు పండ్లు నూతన వస్త్రాలు కొబ్బరికాయలు బెల్లం పుట్టు వెంట్రుకలు తల్లులకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుని భక్తులు తరించి పోయారు.జాతర పరిసర ప్రాంతాలైన మ్యూజియం చిలకలగుట్ట సారలమ్మ గుడి సందర్శించి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు.కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు తల్లులకు కోళ్లను మేకలను నైవేద్యంగా సమర్పించి కోసుకుని వంటలు చేసుకుని తిని విడిది చేశారు.అనంతరం తిరిగి వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 08:15PM