నవతెలంగాణ- తాడ్వాయి
మేడారం సమ్మక్క సారలమ్మ లను పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. వరంగల్ జడ్జి నరసింహ, మహబుబాబాద్ ఎంపి పోరిక బలరాం నాయక్, వర్థన్నపేట బీజేపీ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పసర సీఐ శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. వీరికి పూజారులు ఆదివాసి సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గద్దెల వద్దకు స్వాగతం పలికారు. అనంతరం తల్లులకు పసుపు కుంకుమ పూలు పండ్లు నూతన వస్త్రాలు కొబ్బరికాయలు బెల్లం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జడ్జి, విఆర్ఓ బోప్ప సమ్మయ్య ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 08:22PM