నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
మొదటి విడత డీడీలు కట్టిన వారికీ వెంటనే గొర్రెలను మంజూరు చేయాలని సోమవారం బీజేపీ బీసీ మోర్చ తరుపున నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఓబీసీ మోర్చ ఇంచార్జి పోతన్ కార్ లక్ష్మీనారాయణ, బీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకంలో భాగంగా గొర్రెల కాపరులకు ఆర్థిక చేయూత నివ్వడానికి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది, దానిలో భాగంగా గొర్రెలు కావాలనుకునే వారి దగ్గర నుండి 31,250 రూపాయలు సేకరించి, మూడు సంవత్సరాలు అయినా కూడా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ జరగలేదని అన్నారు. మళ్లీ రెండో విడత పంపిణీ అని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ మొదటి విడత డీడీలు కట్టిన వారికీ వెంటనే గొర్రెలను మంజూరు చేస్తూ రెండో విడత వారికి నేరుగా వారి అకౌంట్ లో నగదు బదిలీ చేసి, గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించాలని అని అన్నారు. అలాగే ప్రతి గొర్రెల కాపరి అకౌంట్‌లో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 1 లక్ష 25 వేలు రుపాయలను (మంచి గొర్రెలను మేమే కొనుక్కొంటాం) నేరుగా జమచేయాలని అన్నారు. 50 ఏళ్ళు నిండిన గొర్రె కాపరులకు రూపాయలు 3000 పింఛన్ ఇవ్వాలని అన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రె కాపరులకు 6 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని అన్నారు. 559,1016 జీవోలను తక్షణం అమలు చేసి, బంచరాయి, బీడు, శికం భూములను గొర్రెల మేతకు కేటాయించాలని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో 20 ఎకరాల భూమిలో గొర్రెల షెడ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. గొర్రెల అంగడ్ల కోసం గొర్రెల అంగడి ఉన్న ప్రతిచోటా 10 ఎకరాల స్థలం కేటాయించాలని అన్నారు. గొర్రెల అంగడ్లు గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ స్వాధీనంలో ఉండాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగుల వినోద్, రాష్ట్ర బిసి మోర్చ ఉపాధ్యక్షులు మరంపల్లి.గంగాధర్, పంచారెడ్డి.లింగం, రాజశేఖర్, శ్రీనివాస్ ధర్పల్లి, గొడుగు.ధర్మపురి, దెవల్ భజరంగ్, అమంద్ కృష్ణ, సురేష్ యాదవ్, శంకర్, అప్కారి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 05:13PM