- మాదిగ జేఏసి ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి
నవతెలంగాణ గోవిందరావుపేట
నేడు ములుగు జిల్లాకు విచ్చేస్తున్న మాదిగల జాగృతి పాదయాత్రను జయప్రదం చేయాలని మాదిగ జేఏసి ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి అన్నారు. సోమవారం మండలంలోని పసర చల్వాయి గ్రామాల్లో రథయాత్రపై మాదిగ జేఏసి ముఖ్య కార్యకర్తల సమాఖ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ బిజెపి పార్టీలు మాదిగలకు తీరని అన్యాయం చేశారని ఆయన అన్నారు.ఎన్నికలకు ముందు వర్గీకరణ హామీ ఇచ్చి ఆ తరువాత వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తూ కప్పదాటు ధోరణి అవలంభిస్తున్నారని ఆయన అన్నారు.వర్గీకరణ లక్ష్యంగా నేతాజీ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 18 నుండి మాదిగల జాగృతి రథయాత్ర ప్రారంభం అయిందని ఆయన అన్నారు. వర్గీకరణ తో పాటు 12 శాతం రిజర్వేషన్ సాధనకు ఐక్యంగా కృషి చేయాలని చేపట్టిన ఈ రథయాత్ర మార్చి 2న ములుగు జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా మాదిగలు ఎస్టీ బీసీలు విద్యార్థిలోకం మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసి నాయకులు ప్రదీప్ నవీన్ సాంబయ్య రాజేష్ రాకేష్ అన్వేష్ ప్రకాష్ జెమిని తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 05:21PM