- నగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
వృత్తి పేరుతో దూషించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను క్యాబినెట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని స్వర్ణకారులు నిరసన తెలిపారు. విశ్వకర్మ ముద్దు బిడ్డ విద్యావేత్త దాసోజు శ్రావణ్ ని మంత్రి హోదాలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన కులవృత్తిని అడ్డుపెట్టి 'గొట్టంగాడు' అని తిట్టడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అని నగర స్వర్ణకార సంఘం సభ్యులు స్వర్ణకారులు అందరూ నిరసనగా వారి షాపులను స్వచ్ఛందంగా మూసివేసి నగరంలోని గాంధీ గంజి నుండి తమ యొక్క పవిత్రమైన పనిముట్టు అయిన గొట్టాన్ని ప్రదర్శిస్తూతూ నిరసన తెలుపుతూ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడింది విశ్వబ్రాహ్మణ జాతీయుడైన మారోజు వీరన్న, శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వల్లనేనని కొనియాడారు. ఇటువంటివి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో తమకు తమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి అని వాపోయారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా దాసోజు కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయనా కేటీఆర్ విసిరిన సవాలును స్వీకరించి ముందుకు వచ్చిన దాసోజు శ్రవణ్ ని మంత్రి హోదాలో ఉన్న నువ్వు తిట్టడం సబబు కాదని హెచ్చరించారు. అసలు తెలంగాణ ఉద్యమంలో ని పాత్ర ఏమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు, విశ్వబ్రాహ్మణ జాతికి బిడ్డలు ఎక్కడ ఉన్న కింది స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చిన వారని నీలాగా పనికిమాలిన రాజకీయాలు చేసి పదవులు పొందలేదని తెలిపారు. ఇప్పటివరకు త్యాగాలు చేసిన విశ్వబ్రాహ్మణ సమాజాన్ని చూశారని, ఇకముందు తమ సామాజిక వర్గం జోలికి గాని నాయకులు జోలికి గాని వచ్చిన యెడల విశ్వ బ్రాహ్మణ జాతి తెగింపుని కూడా రుచి చూపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర జిల్లా స్వర్ణకార సంఘం కమిటీ సభ్యులు, స్వర్ణకార వృత్తి దారులు పాల్గొనడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 05:30PM