- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సామల రాజేష్, కె.రాజు
నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పద్మశాలి సంఘం జిల్లా నాయకులు పుల్గాం హన్మండ్లు, నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు లోలం జగదిష్ లు సోమవారం తెలిపారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షులుగా గన్నారం గ్రామానికి చెందిన డాక్టర్ సామల రాజేష్, ప్రధాన కార్యదర్శిగా అమ్సన్ పల్లి కి చెందిన కోండ్యల రాజబాబు, కోశాధికారిగా చంద్రన్ పల్లికి చెందిన చింతకింది గంగాదాసు, అధ్యక్షులుగా వింజమూరి ప్రకాష్, వేముల ప్రకాష్, ఇరమల్ల రవి, కోశాధికారులుగా మచ్చ తులసి దాసు, పర్లల భుమయ్య, తిర్మన్ పల్లి కి చెందిన మేకల క్రాంతి కుమార్, కార్యవర్గ సభ్యులుగా గోసికె రాజు, ఉదడి గోవర్ధ,న్ బోట్ల రాజేందర్, బయిండ్ల మచ్చేందర్, వెముల సంజివ్ లను ఎన్నుకున్నట్లు రూరల్ అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సామల రాజేష్ కొండ్యల రాజబాబు తో మాట్లాడుతూ మండలంలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందర్నీ కలుపుకుంటూ పరిష్కరించే విధంగా తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవం చేసిన పద్మశాలి సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మండల పద్మశాలి సంఘం ఎన్నిక
మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు మండల అధ్యక్షునిగా యనంపల్లికి చెందిన అంకం నరహరి ని ఎన్నుకున్నట్లు పద్మశాలి సంఘం రూరల్ అధ్యక్షులు లోలం జగదీష్ తెలిపారు.,మండల అధ్యక్షులు గా అంకం నరహరి, ప్రధాన కార్యదర్శి లక్కవత్రి శ్రీధర్, ఉపాధ్యక్షులు వై నరేష్, శ్రీనివాస్, దాసరి గంగాధర్, సహాయ కార్యదర్శులుగా జీ లక్ష్మీనరసయ్య,
జి.సురేష్, ఎర్రం రాము, కోశాధికారిగా వేముల లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా భత్తుల మోహన్ దాస్ లను ఎన్నుకున్నట్లురూరల్ అధ్యక్షులు లోలం జగదిష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె భుమన్న, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శక్కరి కోండ కృష్ణ, జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 06:06PM