నవతెలంగాణ కోడేరు
ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కే పట్టభద్ర ఎన్నికల్లో పట్టం కట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల పరిధిలోని సింగయి పల్లి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గారికి పట్టం కట్టి ఉద్యోగ నిరుద్యోగ కార్మిక సమస్యలపై పోరాడేందుకు అందరూ చేయి చేయి కలిపి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ను శాసన మండలికి పంపించాలని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు రైతుల ఇబ్బందులను గుర్తించని కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం తప్పదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి చంద్రమౌళి ఆయా గ్రామాల సీపీఐ(ఎం) నాయకులు యువకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 07:38PM