నవతెలంగాణ - నిజాంసాగర్
రైతుల శ్రేయస్సే టీఆర్ఎస్ లక్ష్యం అని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.సోమవారం ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.అదేవిధంగా రైతులు ప్రతి నెలకోసారి సమావేశం ఏర్పాటు చేసుకుని తమ పంటల లాభ దాయక వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.వారం రోజుల్లో కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తాయని అన్నారు.నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపనకు త్వరలో సీఎం కేసీఆర్ రానున్నట్లు పేర్కొన్నారు.దింతో పిట్లం,బిచ్కుంద, పెద్ద కొడప్ గల్ మండలాల రైతుల భూములు సస్యశ్యామలం కనున్నాయని అన్నారు.అనంతరం మండలంలోని అచ్చంపేట్,వడ్డేపల్లి, గాలిపూర్ గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు.అదేవిధంగా మాగి, మక్దుంపూర్,గిర్ని తాండ,ధూప్ సింగ్ తాండలలో వైకుంఠధామల నిర్మాణం పూర్తి కావడంతో ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమాలలో మండల అధ్యక్షురాలు పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్,సీడీసీ చైర్మన్ గంగారెడ్డి,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ,ఆయా గ్రామ సర్పంచులు రమేష్ గౌడ్,అంజయ్య,లక్ష్మీ నారాయణ,లక్ష్మ రెడ్డి,చందర్, కడవత్ అనిత,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మహేందర్,అధికారులు ఎంపిడిఓ పర్బన్న,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 07:39PM