- హాజరైన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు..
- కార్లు, బైకులతో పెద్ద ఎత్తున ర్యాలీ..
నవతెలంగాణ నవీపేట్
మండలంలోని జన్నెపల్లి పురాతన శివాలయ ఆధునీకరణ అనంతరం ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, షకీల్ అమీర్, జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం పునర్ ప్రారంభించారు. హైదరాబాద్ నుండి కార్లతో ర్యాలీ నిర్వహించడంతో పాటు నిజామాబాద్ మాధవ నగర్ నుండి బైక్ ర్యాలీ లతో ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించడమే కాక ఆలయంలో వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు పురాతన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పునరుద్ధరించేందుకు సంకల్పించి సంపూర్ణం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జన్నెపల్లి గ్రామ అభివృద్ధికి బాసటగా ఉంటామని అన్నారు. జన్నెపల్లి గ్రామాన్ని మండల కేంద్రంతో పాటు సెంట్రల్ లైటింగ్, సిసి రోడ్లు వేయాలని ఎమ్మెల్యే షకీల్ అమీర్ కోరగా కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాధనగారి విఠల్రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, దయానంద్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు మరియు భక్తులు వందల సంఖ్యలో హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 08:07PM