నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని భాగీరథి పల్లి గ్రామంలో సోమవారం రోజు గ్రామానికి చెందిన గంగయ్య గారి నర్సింహులు (33) అనే యువకుడు తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 08:19PM