- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి
- లేనియెడల ఉద్యమాలు తప్పవు
- నిజామాబాద్ జిల్లా ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బెజ్జం సుజాత
నవతెలంగాణ కంటేశ్వర్
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దళిత మహిళలపై హత్యలు లైంగికదాడులు పెరిగిపోతున్నాయి అనికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని లేనియెడల ఉద్యమాలు తప్పవని నిజామాబాద్ జిల్లా ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బెజ్జం సుజాత తెలిపారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఐద్వా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దళిత మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయినా ఉత్తరప్రదేశ్లో దళిత మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హత్యలు హత్యచారాలు ఠాకూర్ కుటుంబాలకు సంబంధించిన యువకులు దళిత కుటుంబాల ఇళ్ళ ముందు సాయంత్రం కాగానే కుర్చీలు వేసుకుని కూర్చుని దళిత మహిళలు ఇంటి బయటకి రాగానే తీసుకువెళ్లి హత్యలు, లైంగికదాడులు చేసి చంపేస్తున్న పరిస్థితి అక్కడి ఎస్ఐలకు సీఐలకు పోలీస్ కంప్లైట్ ఇద్దామని వెళ్ళిన దళిత కుటుంబాలకు మిమ్మల్ని హత్యలు లైంగికదాడులు చేసేది కుటుంబ సభ్యులు కాబట్టి మేము కేసు పెట్టలేం మీకు ఏది చేతనైతే అది చేయండి అని బెదిరించి పంపుతున్న పోలీస్ వ్యవస్థ కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ రకమైన రక్షణ కల్పించింది ఈ సందర్భంగా సమాధానం చెప్పాల్సి ఉందని మేము ప్రశ్నిస్తున్నాం మహిళా సంఘంగా రేపు రానున్న రోజుల్లో ఇది ఇలాగే కొనసాగితే దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నిజామాబాద్ జిల్లా ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బెజ్జం సుజాత విమర్శించారు ఈ కార్యక్రమంలో లావణ్య రేఖ వనజ తదితరులు పాల్గొన్నారు.