నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రశివారు లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణకాశీగా పిలవబడే శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ రెండు నెలల హుండి లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా రెండు నెలలకు గాను భక్తులు మూడు లక్షల 14 వందల 36 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరాత్రి ఉత్సవాల పై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట్ నారాయణ, ఆలయ పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 03:34PM