నవ తెలంగాణ సుల్తాన్ బజార్
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వరిని భారీ మెజార్టీతో గెలిపించాలని రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత రాథోడ్ అన్నారు. మంగళవారం కోఠిలోని కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీన కోఠిలోని ఐఎంఏ హాల్లో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి రంగారెడ్డి - మహబూబ్ నగర్ - హైదరాబాద్ జిల్లాలలోని నర్సింగ్ ఉద్యోగులు తరలి రావాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రిటైర్డ్ నర్సింగ్ ఉద్యోగి ఎ.రాజేశ్వరి పోటీ చేస్తుందని ఆమెకు మద్దతుగా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత నర్సింగ్ పట్టభద్రులపై ఉందన్నారు. వైద్య శాఖలో ఉద్యోగులందరూ రాజేశ్వరికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నిర్వహించే సమావేశానికి పెద్దఎత్తున వైద్య శాఖ ఉద్యోగులు అందరూ పాల్గొనాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 05:12PM