నవ తెలంగాణ ధర్మసాగర్
వరంగల్ అర్బన్ జిల్లా మండలంలోని ఉనికిచెర్ల గ్రామానికి చెందిన ప్రజా వాగ్గేయకారుడు మైస ఎర్రన్నకు విజయవాడ ఫిలింఛాంబర్ వారి ఆధ్వర్యంలో వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ట పురస్కారం - 2021 ప్రధానం చేశారు. ఆదివారం విజయవాడలోని అక్కినేని కేంద్రంలో ఆదరణ ఆలయం రెడ్డి సమర్పణలో వేదిక క్రియేటివిటీ కల్చర్ అండ్ స్కిల్ సొసైటీ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామానికి చెందిన మైస ఎర్రన్నకు అధ్యక్షులు కార్తీక్ రెడ్డి, జ్యోతి రెడ్డి, మాధవి రెడ్డి.గడిచర్ల రాజేశ్వరి, ఏపీ సాహిత్య అకాడమీ మెంబర్,డాక్టర్ కత్తిమండన ప్రతాప్, డాక్టర్ అరవల్లి నరేందర్ గార్ల చేతుల మీదుగా ఈఅవార్డును అందజేశారు. ప్రజా ఉద్యమ కవి గా గుర్తించి నంది అవార్డులు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మైస ఎర్రన్న మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికి చర్ల గ్రామానికి చెందిన మైస కొమురయ్య కొమరమ్మ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించాను. అని విద్యార్థి దశ నుండి విప్లవ గీతాలను వింటూ ఈ క్రమంలోనే తెలంగాణ ధూమ్ దాం కార్యక్రమాల్లో గద్దర్ గోరంటి వెంకన్న వంటి కళాకారులతో స్టేజిని పంచుకున్నాను. పల్లె పాట నాకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. అనేక ప్రజా ఉద్యమాలలో వందలాది సభల్లో పాత్రలు చూపించినందుకు నాలాంటి కళాకారుడికి ఈ అవార్డు దక్కడం చాలా సంతోషం అన్నారు. విజయవాడ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి ప్రోత్సాహకాలను అందించడం వల్ల నాలాంటి వాళ్ళు ఇంకా ఉత్సాహంతో సమాజ మార్పు కోసం ఆటలతో ప్రజా చైతన్యం చేసే దిశగా ప్రయత్నిస్తామని అన్నారు.ఈ అవార్డుకు ఎంపికైన మైస ఎర్రన్న కు కవులు, కళాకారులు, వివిధ ప్రజాసంఘాల నేతలు, వరంగల్ ఉమ్మడి జిల్లాల ప్రజలు అభినందలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 05:40PM