- బ్రోచర్లు, రిసిప్ట్ బుక్కుల స్వాధీనం..
నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ పరిధిలో ని అమ్సన్ పల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా శ్రీ బాలాజీ లక్కి లాటరి నిర్వహిస్తున్న బకరం రంజిత్ వద్ద నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐ మెహమ్మద్ శాకిర్ అలీ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మికంగా ఇందల్ వాయి ఎస్సై శివప్రసాద్ రెడ్డి తో కలిసి దాడి చేసి బకరం రంజిత్ వద్ద ఉన్న లక్కి లాటరి కి సంబంధించిన 65 బ్రోచర్లను, క్రాష్ రిసిప్ట్ బుక్కు లను సింధ్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుట్టు చప్పుడు కాకుండా గ్రామాల్లోని అమాయక ప్రజలను ఆకర్షించడానికి కోండ్రు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లక్కి లాటరి లో పేర ప్రజలకు మోసం చేస్తున్నారని విశ్వాసానికి గా సమాచారం అందడంతో బకరం రంజిత్ వద్ద దాడి చేసి అయినా వద్ద ఉన్న కోన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రంజిత్ తోపాటు ఇంకా ముగ్గురు కలిసి ఈ లక్కి లాటరి నిర్వహిస్తున్నరాని వివరించారు.స్వాదినం చేసుకున్న వాటిని ఎస్సై శివప్రసాద్ రెడ్డికి అందజేసి నోట్లు తెలిపారు.ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 06:44PM