నవతెలంగాణ-తాడ్వాయి
తాడ్వాయి మండలం నర్సాపూర్(పిఏ) గ్రామంలో విజయ డైరీ పాల సేకరణ కేంద్రం మంగళవారం స్థానిక సంర్పంచ్ మంకిడి నర్సింహ్మ స్వామి ఆధ్వర్యంలో ఎటునాగారం విజయ డైరీ పాల సేకరణ కేంద్రం మేనేజర్ తడక సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరసింహ స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాడి రైతులకు లీటరుకు 4 రూపాయల పారితోషికం ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయ డైరీ మేనేజర్ తడక సుమన్ మాట్లాడుతూ.. నాణ్యమైన విజయ పశు దాన అతి తక్కువ ధరలో పాల ఉత్పత్తిదారులకు 10 శాతం సబ్సిడీతో అరువు పై అందిస్తున్నామని, మినరల్ మిక్చర్ క్యాల్షియం 50% సబ్సిడీ మీద సరఫరా చేస్తున్నామని, రైతుల ప్రతి పాడి పశువులకు సహకార సంఘాల ద్వారా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు, గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల లోని రైతులు, విజయ డైరీ కి పాలు పోసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్, నర్సాపూర్ గ్రామాల పాడి రైతులు తదితరులు పాల్గోన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 08:33PM