నవతెలంగాణ-తాడ్వాయి
మేడారంలో నేడు తిరుగు వారం పండుగ పూజారులు కూడా సమ్మక్క సారలమ్మ గుడిలో వద్దనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, పూజారులు కానీ ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరికి కూడా గద్దెల వద్దకు వెళ్ళేది లేదని, ఎవరికీ ప్రవేశం లేదని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు ఎండోమెంట్ ఈవో రాజేంద్రం లు స్పష్టం చేశారు. ప్రతి జాతర అనంతరం బుధవారం అయిన తిరుగు వారం రోజు అందరం ఘనంగా తిరుగు వారం పండుగ జరుపుకునే వారం అని, ఎండోమెంట్ సిబ్బందికి ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో తిరుగు వారం పండుగను సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద కు వెల్లకుండా, గుడిలోనే పూజలు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎవరికీ ప్రవేశం లేదని తెలిపారు. భక్తులు సహకరించాలని అని కోరారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న కారణంగా అందరి క్షేమం కోరి, పూజారులతో, ఎండోమెంట్ అధికారులతో, గ్రామ పెద్దలతో చర్చించి, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున భక్తులు సహకరించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 08:36PM