నవతెలంగాణ కంటేశ్వర్
నిబంధనలకు విరుద్దంగా తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులను దూషించినందుకు బుధవారం విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం నర్సరీ నుంచి తరగతులు నిర్వహిస్తున్నారు అని తెలుసుకొని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టి.జి వి పి, ఎన్ ఎస్ యు ఐ తనిఖీ కెవెళ్ళే విద్యార్థి సంఘాల నాయకులపై కులం పేరుతో దూషించిన ఆర్ ఐ ప్రవీణ్ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మంగళవారం డిమాండ్ చేశారు. అలాగే అలాగే విద్యార్థి సంఘాలు ఆసభ్య పదజాలంతో శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని అదేవిధంగా జోనల్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న అటువంటి ప్రవీణ్ కుమార్ ను వెంటనే విధుల నుంచి తొలగించి తక్షణమే కులం పేరుతో దూషించిన అటువంటి విద్యార్థి నాయకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏ ఐ పి ఎస్ యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ, ఎన్ ఎస్ యు ఐ, టీజీ వీపీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది కావున ఎల్లప్పుడూ ప్రైవేట్ విద్యాసంస్థల కు అండగా నిలిచే విద్యార్థి సంఘాలను దూషించిన అటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా మీరు కూడా మీ మన ఈ విద్యార్థి సంఘాలకు మద్దతుగా నిలవాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కోరుతున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 08:38PM