నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీ హైదరాబాదులోని ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ సాహిత్యం నాడు-నేడు అనే అంశంపై నిర్వహించనున్న జాతీయ సారస్వత సదస్సులో నిజామాబాద్ చెందిన ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ జాతీయ సదస్సులో శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ పిల్లలమర్రి రాములు, తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, డాక్టర్ రాజేంద్ర సింగ్, డాక్టర్ ఉడయవర్లు, డాక్టర్ దేవకీదేవి, డాక్టర్ నిదానకవి నీరజ తదితర ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మేరకు సదస్సు సంచాలకులు డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి ఆహ్వానాన్ని పంపించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 09:11PM