నవతెలంగాణ ధర్మసాగర్
నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల వామపక్షాల అభ్యర్థి జయ సారథి రెడ్డి కి బ్యాలెట్ పత్రం క్రమ సంఖ్య రెండు లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పట్టభద్రులను కలిసి జయ సారధి రెడ్డి కి ఓటు వేయాలని సిపిఐ మండల కార్యదర్శి మర్రిపల్లి అంకుష్ ఆధ్వర్యంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఆశించిన తెలంగాణ రాలేదని నిధు నియామకాలు చేపట్టలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర లో ఉన్న నిరుద్యోగులను అభివృద్ధి లోకి తీసుకు రావడం లో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకు చేసిందేమీ లేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయ సారథి నీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేలేరు సిపిఐ మండల కార్యదర్శి బట్ట మల్లయ్య,సిపిఐ నాయకులు కొట్టే ప్రభాకర్,చిలుక బాబు, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 12:23PM