- జాతీయ బీసీ విద్యార్థి సంఘం నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు నావాతే ప్రతాప్
నవతెలంగాణ కంటేశ్వర్
మహిళలపై దాడి చేసిన వారిని వెంటనే ఉరి తీయాలి అని జాతీయ బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నావాతె ప్రతాప్ అన్నారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ నగరంలో రైల్వే కమాన్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా న వాతే ప్రతాప్ మాట్లాడుతూ నిన్న మహబూబ్ నగర్ జిల్లా మణికొండలో ఓ ప్రేమోన్మాది మహిళపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు దాడికి పాల్పడిన షారుక్ సల్మాన్ ను వెంటనే ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు దేశంలో మహిళల పై జరుగుతున్న దాడుల విషయంలో పేద ధనిక విభేదాలు లేకుండా చూసినప్పుడే మహిళలకు కు సరైన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దేశంలో నిర్భయ చట్టం అమలులో ఉన్న నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి దాడులపై ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అవధూత్ ప్రసాద్ బీసీ విద్యార్థి మహిళా కమిటీ మాధురి ఉమా ఉష నవ్య రమ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 03:22PM