- జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ నవీపేట్
మనం నివసించే గ్రామాలను అనుకూలంగా చేసుకుంటే స్వర్గ సీమ లుగా మారుతాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని కమలాపూర్ గ్రామంలో అంకాలమ్మ పోలేరమ్మ ఆలయాన్ని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు తో కలిసి బుధవారం ప్రారంభించారు. అంకాలమ్మ పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహించి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ మనం ఎంత ఎత్తుకు ఎదిగిన మన గ్రామం అనే ప్రేమ ఎన్నటికీ ఉంటుందని కావున మనం నివసించే ఊరి వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటే స్వర్గ సీమలుగా మారతాయని అన్నారు. కాబట్టి గ్రామాలలో మొక్కలు నాటి సంరక్షించు కుంటే పచ్చగా ఉండి గ్రామ ఐక్యతను చాటుతాయని అన్నారు. గ్రామ ప్రజలు ఏకతాటిపై ఉంటే ప్రభుత్వాలు వారి వెనకాలే ఉంటాయని అన్నారు. గ్రామంలో నిర్మించిన అంకాలమ్మ పోలేరమ్మ గుడిని చూస్తే తమ ఊరు గుర్తుకు వచ్చిందని అన్నారు. ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించిన గ్రామస్తులను అభినందించారు. గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీ, పశువుల ఆసుపత్రి తో పాటు గ్రామానికి మంజూరు చేసిన నాలుగు పడకల ఆసుపత్రి పనుల విషయమై గ్రామస్తులు రమణారెడ్డి కోరగా విడతలవారీగా సర్పంచ్, గ్రామ పెద్దల సహకారంతో పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు పోతిరెడ్డి కుటుంబం నిర్మించిన నీళ్ల ట్యాంక్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, రామ్ కిషన్ రావు, ఏ టి ఎస్ శ్రీనివాస్, సర్పంచ్ సూరమ్మ, ఎంపీపీ సంఘం శ్రీనివాస్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య, నర్సింగ్ రావు, ఎంపీటీసీ జనార్ధన్, బుచ్చన్న,ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సభ్యులు మురారెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, రమేష్ రెడ్డి, సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 03:25PM