- పెంచిన వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి
- సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని బుధవారం సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను రోజురోజుకు పెంచేస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజల పైన కార్మికుల పైన పెను భారాలను మోపుతూ ఇబ్బందులపాలు చేస్తున్నారని నరేంద్ర మోడీ ప్రభుత్వం పో రేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చి పెట్టటానికి మాత్రమే ఉన్నారు తప్ప మధ్యతరగతి ప్రజల కార్మికుల బాధలను పట్టించుకోవడంలేదని కార్మికులకు రోజురోజుకు పనిదినాలు తగ్గిపోయి వేతనాలు పడిపోతున్న ప్పటికీ వారి బాధలను అర్థం చేసుకోకుండా ఉపాధి అవకాశాలు పెంచకుండా నిత్యావసర సరుకుల ధరలు పెంచటం మూలంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దేశంలో కార్పొరేట్ కంపెనీలు కాక సామాన్య ప్రజలు కూడా బతక వలసిన అవసరం ఉండదని ఆమె విమర్శించారు ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం డీజిల్ ధరలు తగ్గించి సాధారణ ప్రజలను కాపాడాలని అసంఘటిత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ గౌరవ వేతనం తో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దేవ గంగు స్వర్ణ చంద్రకళ వాణి జ్యోతి రాజ్యలక్ష్మి యమునా, ఎలిజబెత్ జరీనా అనసూయ ఎస్ ఎఫ్ ఐ నగర అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 05:09PM