- బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు
నవతెలంగాణ-గోవిందరావుపేట
టిఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించే నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలిపించాలని బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు అన్నారు. బుధవారం మండలంలోని చల్వాయి పసరా గ్రామాలలో గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గెలుపు కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక భవిష్యత్తులో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా బిజెపి అభ్యర్థిని గెలిపించి టిఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని అది పట్టభద్రుల ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని లేకపోతే ఓటు అడగమని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై ముఖం చాటేస్తున్న కేటీఆర్ లకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. అదేవిధంగా గా గోవిందరావుపేట మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ వలసినదిగా కోరారు .ఈ ప్రచారంలో మండల అధ్యక్షుడు తేజ రాజు జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి కర్ర సాంబశివ రెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతి సీనియర్ నాయకులు దేవేందర్ రావు రామకృష్ణ రమ తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 05:11PM