నవతెలంగాణ - భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన సత్యనారాయణ, కుమారుడు బబ్లు అలియాస్ మహేష్ కుమార్ తండ్రి కొడుకులు గత కొన్ని రోజులుగా హర్యానా రాష్ట్రం నుండి అక్రమంగా మద్యాన్ని తీసుకువచ్చి అమ్ముతుండడంతో పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు బుధవారం జంగంపల్లి గ్రామ శివారు లోని సామిల్ వద్ద నిల్వ ఉంచిన సుమారు రెండు లక్షలకు పైబడి విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా హర్యానా నుండి మద్యాన్ని తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తూ ఉండడంతో బుధవారం తెల్లవారుజామున ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకొని తండ్రి కొడుకుల ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ పోతి రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 06:08PM