నవతెలంగాణ గోవిందరావుపేట
మండలంలోని బాలాజీ నగర్ పరిసర గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ మృతుల కుటుంబాలను బుధవారం కాంగ్రెస్ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి సానుభూతి తెలియజేశారు. పార్టీ తరపున ఆమె వారికి ఆర్థిక సహాయం అందించారు. ముందుగా గోవిందరావుపేట మండలం కర్లపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ధరవత్ పూర్ణ గాంగ్ తండ్రి రెండు రోజుల క్రితం మరణించగా వారి 3వ రోజు దిన కర్మకు హాజరై ధరవత్ సారయ్య చిత్రా పటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పస్రా గ్రామంలో వీణ సయ్యద్ తల్లి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులును మరియు పస్రా ఉప సర్పంచ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి గారు , టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ కుమార్ గారు , యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ గారు , ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ గారు , పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి , ఎస్ టి సెల్ ఉప అధ్యక్షులు కుర్సం కన్నయ్య గోవిందరావుపేట మండల అధ్యక్షులు ధర్మ అంజి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కణతల బుజ్జి నాగేందర్ రావు ,కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి పాలడుగు వెంకట కృష్ణ , యూత్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, గోవిందరావుపేట సర్పంచ్ లావుడ్యా లక్ష్మి -జోగ నాయక్ ,పస్రా సర్పంచ్ ముద్దబోయిన రాము, చల్వాయి ఉప సర్పంచ్ హరిప్రసాద్, ఎంపీటీసీ ఏడుకొండలు, శ్రవణ్ , కిరణ్ , సురేష్ , చంద్ర కాంత్ సాయి మరియు గ్రామ నాయకులు వర్డ్ మెంబర్స్ తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 07:50PM