నవతెలంగాణ గోవిందరావుపేట
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ గెలిపించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు బుధవారం గోవిందరావుపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి ఆధ్వర్యంలో వరంగల్ , నల్గొండ ,ఖమ్మం పట్టభద్రుల వీూజ అభ్యర్ధి సభావత్ రాములు నాయక్ గోడ పత్రికలు ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని టిఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆమె అన్నారు.నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకుండా డొల్లతనం తో వ్యవహరిస్తోంది టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అది సాధ్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి, టి పి సి సి కార్యదర్శి పైడాకుల అశోక్ కుమార్ , యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ , ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ , పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి , ఎస్ టి సెల్ ఉప అధ్యక్షులు కుర్సం కన్నయ్య గోవిందరావుపేట మండల అధ్యక్షులు ధర్మ అంజి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కణతల బుజ్జి నాగేందర్ రావు ,కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి పాలడుగు వెంకట కృష్ణ , యూత్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, గోవిందరావుపేట సర్పంచ్ లావుడ్యా లక్ష్మి -జోగ నాయక్ ,పస్రా సర్పంచ్ ముద్దబోయిన రాము, చల్వాయి ఉప సర్పంచ్ హరిప్రసాద్, ఎంపీటీసీ ఏడుకొండలు, యూత్ నాయకులు శ్రవణ్ , కిరణ్ , సురేష్ , సాయి , చంద్ర కాంత్ , రామ్మోహన్, మహిళలు ఉషా రాణి , కీర్తన , రమ్య , మరియు గ్రామ నాయకులు వర్డ్ మెంబర్స్ తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.....
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 08:14PM