నవ తెలంగాణ కంటేశ్వర్
అంగన్వాడీ కార్యకర్తల పైన వేధింపులు మానుకోవాలి అని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో అంగన్వాడీ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించుకునే జిల్లా ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు
ఏ.రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల పైన విపరీతమైన పని భారం ముత్తు వారికి సంబంధం లేని పనులను ఆన్లైన్ పనులను డేటా ఎంట్రీ లను చేయాలని కార్యకర్తల పైన ఒత్తిడి చేస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫలితంగా అనేక మంది కార్యకర్తలు అనారోగ్యాల పాలు హాస్పిటల్లో చేరుతున్నారని ఇది సరైంది కాదని సంబంధం లేని పనులను అధికారులు కార్యకర్తలతో చేయించకూడదు అని ఆయన డిమాండ్ చేశారు సర్వే రికార్డులను కార్యకర్తలకు ఇవ్వకుండా ఆన్లైన్లో రిపోర్టులు ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తల పై వేధింపులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఎడల జిల్లా వ్యాప్త ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే దేవ గంగు, ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, జిల్లా నాయకులు వాణి, జ్యోతి, లక్ష్మి, ఎలిజబెత్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 08:29PM