- రిజిస్టార్ కార్యాలయం వద్ద ధర్నా..
నవతెలంగాణ డిచ్ పల్లి
న్యాయశాస్త్ర విభాగంలో ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే భర్తీ చేయాలని పిడిఎస్యు యూనివర్సిటీ అధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా పిడిఎస్యు తెలంగాణ యునివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం లోపాల ధర్నా నిర్వహించి సమస్యలతో కుడిన వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ యూనివర్సిటీ లో ఎల్ ఎల్ బి కోర్సు లో 2020-21 విద్య సంవత్సరనికి కేవలం సగానికి కంటే తక్కువ అడ్మిషన్స్ వచ్చాయని, మిగతా సీట్లు ఖాళీగా ఉన్నాయని,పీ జీ అడ్మిషన్స్ లో రిపోర్టింగ్ చేసిన జాబితా, ఖాళీల జాబితా సెట్ అధికారులకు పంపడంతో యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, బయట కాలేజీలకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని,ఖాళీలు భర్తీ చేయకపోతే యూనివర్సిటీ చదువులు అర్హత కలిగిన విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉందని,ఈ విద్య సంవత్సరం పీజీ సీట్లను పూర్తిగా భర్తీ చేయాలని అదేవిదంగా యూనివర్సిటీలకి అధిక నిధులు మంజూరు చేసే విదంగా తెలంగాణ యునివర్సిటీ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాయి కృష్ణ , డివిజన్ అధ్యక్షులు వరుణ్, యూనివర్సిటీ కమిటీ సభ్యులు సంపత్, బాను,సాయి కిరణ్, ప్రవీణ్ , ప్రశాంత్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Mar,2021 06:32PM