నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ మరియు ఐదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్, ప్రాక్టికల్ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా (రివైస్డ్ నోటిఫికేషన్) ఈ నెల 9 వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించినట్లు తెలంగాణ యునివర్సిటీ పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పాత నాగరాజు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు మార్చి, 2021 లో జరుగనున్నాయి.
100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 13 వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 16 వరకు,1000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 18 వరకు ఫీజును చెల్లించవచ్చని సుచించారు.
డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించలన్నరు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటి వెబ్ సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించగలరు.