నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజారులో పది లక్షల రూపాయల ఎన్ ఆర్ఈజిఎస్, ఎమ్మెల్యే నిధులు మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బోడ నరేష్, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బోండ్ల శేఖర్ కు మంజూరైన సిసి రోడ్ల నిర్మాణ పనులను పట్టణ సర్పంచ్ తునికి వేణు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తునికి వేణు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో పట్టణంలో సిసి రోడ్ల నిర్మాణానికి 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల పట్టణ ప్రజల పట్ల తరుపున ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అంతంపల్లి గ్రామంలో, లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో సిసి రోడ్ల పనులను అయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రామచంద్రం, సొసైటీ చైర్మన్ భూమయ్య, ఆలయ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ ఉప్పల బాబు, మాజీ సర్పంచులు బండి రాములు, నాగభూషణం గౌడ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముదాం సత్తయ్య, నాయకులు వెంకట స్వామి గౌడ్, అంబాల మల్లేశం, బసవయ్య, ప్రభాకర్, వార్డు సభ్యులు సిద్ధిరాములు, వెంకట రాజం, చంద్రం, కో ఆప్షన్ నెంబర్ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ అధికారులు సోహెల్, కిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Mar,2021 09:08PM