- సెలవులు పెట్టని ఉత్తమ ఉపాధ్యాయురాలు విజయ లక్ష్మి
- నగర మేయర్ దండు నీతూ కిరణ్
నవతెలంగాణ కంటేశ్వర్
జాతీయ అవార్డు గ్రహీత, ప్రాథమిక పాఠశాల కులాస్ పూర్ లో ప్రధానోపాధ్యాయురాలు పని చేస్తూన్న నును గొండ విజయ లక్ష్మి ఉద్యొగ విరమణ మహోత్సము నగరంలోని టి ఎన్ జి ఓ భవలో బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ విచ్చేసి మాట్లాడుతూ... పదవి విరమణ అనేది ఇంతటితో ఆగిపోదని, మీ విజయ లక్ష్మి సేవలు జిల్లాకు ఎంతో అవసరముందని, ఉద్యోగిగా మచ్చలేని,విలువలు గలిగి మహిళ లోకానికి ఆదర్శశీగా ఉంటూ ఒక మహిళ గా, ఉపాద్యాయురాలుగా జాతీయ అవార్డు సాదించిందుకు ప్రత్యేకశీగా అభినందించదగ్గ విషయమని, ఉపాద్యాయురాలుగా, ప్రధానోపాధ్యాయురాలిగా తన జీవితం ఉపాధ్యాయ వృత్తికి అంకితం చేసి, ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలిగులు నింపిన విద్య కొండ అని , విద్యార్థుల భవిష్యత్ కు బాటలు వేసేన విజయ లక్ష్మి సేవలు మారువలేనివని అన్నారు..మరో అతిది డీఈఓ ఎన్ వి దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ... 36 సంవత్సరాలు సేవలు అందించి, 2011 లో రాష్ట్ర అవార్డు, 2017 లో జాతీయ అవార్డు సాధించి ఫిబ్రవరి 28 న పదవి విరమణ చేయటం, మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించారని అన్నారు..తన సర్వీస్ లో ఎలాంటి రిమార్కులు లేకుండా విరమణ పొందటం ముఖ్య విషయం అన్నారు.. బిసిటీయూ జిల్లా అధ్యక్షుడు మడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ..కరోన సమయంలో సి ఎం ఫండ్ కి 50 వేలు, జర్నలిస్టులకు 5 వేలు విరాళం అందించి తన ఔదార్యం చాటుకున్నారని, పాఠశాలకు సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేసి అవార్డు పొందరన్నారు.
కార్యక్రమంలో డిఐఇవో రఘురాజ్, మాజీ ఎంఇవో లింగమూర్తి కార్యనిర్వాహక అధ్యక్షులు గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, మహిళా కార్యదర్షి వరలక్ష్మి, బిసి ఉపాధ్యాయ సంఘం నాయకులు రమణస్వామి, రామకృష్ణ, బాబు, శంకర్, విజయ్ కుమార్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Mar,2021 09:17PM