నవతెలంగాణ: నవీపేట్: మండలంలోని కోస్లి గ్రామ శివారులో గల నర్స ఉంటాను కబ్జా నుండి కాపాడాలని కోస్లి గ్రామ రైతులు తాసిల్దార్ లతకు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఇందూరు హరీష్ మాట్లాడుతూ నర్స కుంట నో కొందరు కబ్జా చేసి రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాబట్టి రెవెన్యూ అధికారులు స్పందించి నర్స కుంటను కాపాడి రైతులకు నష్టం కలగకుండా చూడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ సాయిబాబా, రైతులు సందీప్, పెద్దిరాజు, లక్ష్మణ్ లు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm