నవతెలంగాణ, కంటేశ్వర్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఎన్ ఎస్ ఎస్ రీజినల్ డైరెక్టర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు టీయూయూ ఎన్ ఎస్ ఎస్ సెల్ నిశిత డిగ్రీ కళాశాల నిజామాబాదు, ఇతర కాలేజీల ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్టిసీ ప్రాంగణంలో స్వచ్ఛత మసివ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించినట్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ నసీం, నిజామాబాద్ డిపో-1 మేనేజర్ ఆంజనేయులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రొఫెసర్ నసీం మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. తమ చుట్టూ ఉన్న వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత విద్యార్థుల పైనే ఉందని సూచించారు. ఆంజనేయులు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమం చేయడం, ప్రయాణికులకు అవగాహన కల్పించడం పట్ల ఎన్.ఎస్ ఎస్ ప్రతినిధులను అభినందించారు. రీజినల్ డైరెక్టరేట్ ఎన్ఎస్ఎస్ హైదరాబాద్ నుంచి వచ్చిన సంజయ్ మాట్లాడుతూ వలంటీర్లు పాల్గొనడంనవతెలంగాణ, కంటేశ్వర్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్ ప్రవీణ భాయ్ మాట్లాడుతూ రీజినల్ డైరెక్టరేట్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని 19 మార్గదర్శకాలను పాటిస్తూ చేపట్టడం జరిగిందని వివరించారు. వలంటీర్లు ఆర్టీసీ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసి ప్రయాణికులకు అవగాహన కల్పించాలని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 05:14PM