- ఏజెన్సీ నిర్వాహకురలికి షోకాజ్ నోటు .. తహాశీల్దార్ ఆదేశాలు...
ఈఏజెన్సీ నిర్వాహకులు వద్దేవద్దు..
నవ తెలంగాణ డిచ్ పల్లి : మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కుళ్లిపోయిన కూరగాయలతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని ఏజెన్సీ నిర్వాహకులు అని శుక్రవారం వార్తల్లో వచ్చిన కథనాలు, కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం తహాశీల్దార్ శ్రీనివాస రావు ,ఎంపీడీవో మార్రి సురేందర్ ,ఇంచార్జ్ మండల విద్యాశాఖ అధికారిని నాగజ్యోతి లు ఆదర్శ పాఠశాలకు చేరుకుని ఆదర్శ పాఠశాల అధ్యాపకులు,స్కుల్ మేనేజ్మెంట్ కమిటీ, ప్రిన్సిపాల్, సర్పంచ్, పాలకవర్గం,ఉప సర్పంచ్ తల్లిదండ్రులు, విద్యార్థులతో విచారణ చేశారు.గత ముడేళ్లుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలు స్వరూప పై పాఠశాల విద్యార్థులు అధ్యాపక ఉప సర్పంచ్ డీ.శ్రీనివాసరావు గ్రామ యువజన సంఘాల యూత్ సభ్యులు, కుళ్ళిపోయిన కూరగాయలు, కాలం తీరిన మసాల పౌడర్ ,నాసిరకం పస లేని వంటలు చేయడంతో , విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయలేక పడేస్తూ పస్థులు ఉంటున్నారని, చాలా మంది విద్యార్థులు ఇంటి నుండే టిఫిన్ బాక్స్ లో మధ్యాహ్న భోజనం తమ వేంట తీసుకుని వచ్చి మధ్యాన్నం భోజనం తింటున్నారని, తహాశీల్దార్, ఎంపిడిఓలు ప్రత్యేకంగా పరిశీలించి, ప్రిన్సిపాల్ ఛాంబర్ లో విచారణకు వచ్చిన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ నిర్వాహకురాలు స్వరూప ఏజెన్సీ రద్దుచేసి, మంచిగా, నాణ్యతతో కూడిన మధ్యాన్నం భోజనము విద్యార్థులకు పేట్టే వారికి ఏజెన్సీ ఇవ్వాలని రాతపూర్వకంగా ఫిర్యాదులో రాసిన దరఖాస్తుల పత్రాలను అధికారులకు సమర్పించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు అధికారులకు విన్నవించారు. వెంటనే స్వరూపను ఏజెన్సీ నుండి తీసేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థులను పాఠశాలకు పంపడం మానేస్తామని, ఈ సమస్యకు పరిష్కరించకపోతే జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాచేసి, తమ పిల్లల టీసీలు తీసుకొని ఇంటికి తీసుకెళ్తామని అధికారులకు తెలిపారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు స్వరూప కు షోకాజ్ నోటీసు జారి చేయలని తహాశీల్దార్ శ్రీనివాస్ రావు, ఎంఈఓ నాగజ్యోతి, ప్రిన్సిపాల్ గణేష్ కుమార్ లకు ఆదేశాలు జారీ చేశారు. ట్రూ కాల్స్ నోటీస్ తీసుకొని సమయను సారం తిరిగి జవాబు ఇవ్వ లని నిర్వాహకురాలిని శ్రీనివాస్ రావు హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎమ్ సి కమిటీ సభ్యులు విద్యార్థులు అధ్యాపక బృందం ఇచ్చిన దరఖాస్తులను జిల్లా విద్య శాఖ అధికారికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని విచారణకు వచ్చిన తహాశీల్దార్ ,ఎంపీడీవో ,ఎం ఈ ఓ అధికారులు హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 07:14PM