నవతెలంగాణ కంటేశ్వర్
ఇందూరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో రేపు ఉదయం పది గంటలకి రైతు బంధువు విజయ రామ్ 'ప్రకృతి వ్యవసాయం' అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ప్రజలు తమ ఇంటికోసం, తమ బిడ్డలకి ప్రకృతి పరమైన ఆహారపదార్థాలు పెట్టి తద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా రాబోయే తరాలను తయారు చేయాలనే, ఆకాంక్షతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ కో చైర్మన్ శ్రీమాన్ నరసింహ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కరోజు నిర్వహించే ఈ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సులో వాన నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంపొందించుకోవడం, దేశి ఆవు ప్రాముఖ్యత, దేశి విత్తనాల విలువలు, సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం పై అవగాహన, కేవలం 10 శాతం నీటితో పంటలు ఇలా పలువిషయాల పై అవగాహన సదస్సు మరియు చర్చా గోష్టి ఉంటుందని నరసింహారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ చర్చలో పాల్గొన దలచిన వారు ఈ 04027635867, 04027644337, 9866246111 నెంబర్ కు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రకటనలో తెలిపారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 07:23PM