- డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి ట్రాఫిక్ సీఐ కౌన్సిలింగ్
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ ఎస్సై శంకర్, ఏ ఎస్ ఐ అనిల్ ఆల్ రాజు హమీద్ గోపాల్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది నిజామాబాద్ నగరంలో లోని పలు ప్రాంతాలతో పాటు కాలూరు ఎక్స్ రోడ్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ గురువారం రాత్రి నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 5 మంది మద్యం సేవించడంతో వారి పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ తెలిపారు.ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పట్టుబడ్డ వారికి, వారి కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 5 కేసులు నమోదు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి శనివారం నగరంలోని కౌన్సిలింగ్ సెంటర్ లో కౌన్సిలింగ్ ట్రాఫిక్ సి ఐ చందర్ రాథోడ్, ఎస్ ఐ శంకర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో సహా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే అనుకోకుండా ప్రమాదాలు జరిగితే వారి కుటుంబం నష్టపోతుంది అని విధంగా వీడియోలను చూపిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితులలో మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే కోర్టు ద్వారా శిక్ష పడుతుందని అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం పరిస్థితి ఆలోచించాలని పలు సూచనలు చేశారు కావున ప్రతి వాహనదారుడు మద్యం సేవించి వాహనాలన నడపకూడదు అని కోరారు. ఈ కార్యక్రమంలో మద్యం సేవించిన వారి కుటుంబాలతో పాటు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 07:42PM